నేడు ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇస్రో, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం సచివాలయంలో ఒప్పందం కుదరనుంది. ఇస్రో పరిధిలోని డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ (డీఈసీయూ), రాష్ట్ర ఐటీ శాఖ మధ్య మంత్రి కేటీఆర్ సమక్షం లో ఈ ఒప్పందం జరగనుంది. ఒప్పందం ద్వారా కేబుల్ ద్వారా మనటీవీ ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు మనటీవీ ద్వారా గ్రూప్- 2 పరీక్షల కోచింగ్ అందించడాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.