మనటీవీలో మరో 3 గంటలు గ్రూప్ 2 ప్రసారాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మన టీవీలో గ్రూప్-2 ప్రసారాలను మరో మూడు గంటలు అదనంగా ప్రసారం చేయనున్నట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి తెలిపారు. మనటీవీ ప్రసారాలు రోజుకు 4 గంటలపాటు కొనసాగు తున్న సంగతి తెలిసిందే. పోటీ పరీక్షలకు సిద్ధమ య్యే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అనుభవజ్ఞులచే లైవ్ ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. లైవ్ ఇంటరాక్షన్‌లో సమస్యలు ఎదురైనవారు 18004254038 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలని కోరారు.