-మంత్రి కేటీఆర్ ఆదేశంతో కేబుల్‌లో ప్రసారాలు.. మనటీవీ సీఈవో శైలేష్‌రెడ్డి కృతజ్ఞతలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : మనటీవీ కేబుల్ ప్రసారాలు చేసేందుకు కృషిచేసిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు మనటీవీ సీఈవో ఆర్ శైలేష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీవీ చానెల్ మనటీవీని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని శైలేష్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 28న ఇస్రో- ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మనటీవీ ఒప్పందం జరిగింది. మంత్రి కేటీఆర్ సూచనతో ఐదుగురు ఎమ్మెస్వోలు మనటీవీని కేబుల్ ద్వారా ప్రసారం చేస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు సాంకేతిక ఏర్పాట్లను పూర్తిచేసుకుంటున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ నెల 1న ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అధ్యక్షతన కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరుగగా మనటీవీని కేబుల్‌లో ప్రసారం చేసేందుకు ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లు అంగీకరించారు. రెండు రోజుల్లోనే సిటీ విజయ్కేబుల్ 35వ నెంబర్లో హత్‌వేలో 61వ నెంబర్లో, మనటీవీ-1 మనటీవీ-2 చానెల్ 62లో శుబోధరం 20 సిటి కేబుల్‌లోనూ ప్రసారాలు చేస్తున్నారని సీఈవో శైలేష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెస్వోలు త్వరలో సహకారం అందిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు ప్రసారాలు అందిస్తామని, ఇప్పటివరకు 2 లక్షల మంది ప్రసారాలను చూశారని శైలేష్‌రెడ్డి తెలిపారు.