ఐఏఎస్ ర్యాంకర్లు శ్రీజ, అంకితలతో టి-సాట్ ముఖాముఖి

ఐఏఎస్ ర్యాంకర్లు శ్రీజ, అంకితలతో టి-సాట్ ముఖాముఖి

2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్) ర్యాంకర్లతో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు సోమవారం ముఖా ముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. 20వ ర్యాంకర్ పొడిశెట్టి శ్రీజ, 398వ ర్యాంకర్ అంకిత మహావీర్ సోమవారం ఉదయం 10 గంటలకు టి-సాట్ స్టూడియోకు హాజరౌతారని ఆ ప్రకటనలో తెలిపారు. ర్యాంకర్ల అనుభవాలను తెలంగాణ నుండి ఐఏఎస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు పంచేందుకు వీలుగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో స్పష్టం చేశారు. ఉదయం 10 నుండి 11గంటల వరకు టి-సాట్ నిపుణ ఛానల్ ద్వార అందించే లైవ్ కార్యక్రమంలో పొడిశెట్టి శ్రీజ, అంకిత మహావీర్ లు అందుబాటులో ఉండి పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అనుభవాలు తెలియజేయనున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్ లో యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించబోయే పరీక్షలకు ప్రస్తుత టాపర్లు అందించే సలహాలు-సూచనలు స్వీకరించి తెలంగాణ నుండి అధిక సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి తదితర ఉద్యోగాలు పొందాలని శైలేష్ రెడ్డి ఆకాక్షించారు. ప్రత్యేక ప్రత్యక్ష లైవ్ కార్యక్రమం టి-సాట్ నెట్వర్క్ యూట్యూబ్, వెబ్ సైట్ తో పాటు సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విటర్ లోనూ అందుబాటులో ఉంటుందని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి సూచించారు