పత్రిక ప్రకటన 31.07.2021

పత్రిక ప్రకటన 31.07.2021

VLSI పాఠ్యాంశాలకు ఆరు రోజుల్లో….అనూహ్య స్పందన

  • ఇంజనీరింగ్ విద్యార్థుల ఆసక్తి – ప్రతి రోజూ 60వేల వ్యూస్
  • విదేశాల్లోని విద్యార్థులకూ ఉపయోగపడే పాఠ్యాంశాలు
  • టి-సాట్ యాప్, యూట్యూబ్ ప్లే లిస్ట్ ద్వార అందుబాటులో కంటెంట్
  • భవిష్యత్ లో మరిన్ని ప్రసారాలకు సిద్దమౌతున్న ప్రభుత్వం

(టి.సాట్ – సాఫ్ట్ నెట్)

• తెలంగాణ ప్రభుత్వ టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార ప్రసారం చేస్తున్న VLSI ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ పాఠ్యాంశ ప్రసారాలకు మంచి ఆదరణ వస్తోంది. ప్రసారాలు ప్రారంభించిన ఆరు రోజుల్లోనే అనూహ్య స్పందన లభించింది. VLSI ప్రసారాలకు వస్తున్న స్పందనపై టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

• ఈ నెల 26 వ తేదీన VLSI పై ప్రారంభించిన పాఠ్యాంశ ప్రసారాలకు రోజుకు 60 వేల మంది చొప్పున విద్యార్థులు ఫాలో అవుతున్నారని తెలిపారు. టి-సాట్ యాప్, యూట్యూబ్ స్టాటిస్టిక్స్, టీవి ఛానళ్లు విద్య, నిపుణతో పాటు ఫొటానిక్స్ వాలీ నిర్వహించిన సర్వే ద్వార VLSI కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో అనుసరిస్తున్న విషయం స్పష్టమైందని శైలేష్ రెడ్డి తెలిపారు.

• గంట డ్యూరేషన్ గల రెండు వీడియోలను ఉదయం 8.15 నుండి 10.30 గంటల వరకు ప్రతి రోజూ ప్రసారం చేస్తుండగా గత ఆరు రోజుల్లో 12 పాఠ్యాంశాలకు 9,985 వ్యూస్ లభించాయని, సాయంత్రం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు పున: ప్రసారమైన పాఠ్యాంశాలను సుమారు 26,535 ఇంజనీరింగ్ విద్యార్థులు అనుసరించారని సీఈవో స్పష్టం చేశారు.

• ఫొటానిక్స్ వ్యాలీ సంస్థ వద్ద నమోదైన విద్యార్థుల లెక్కల ప్రకారం సుమారు 3,000 మంది ఫాలో అవుతుండగా డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్, ఫేస్ బుక్ ద్వారా వేలాది మంది విద్యార్థులు వి.ఎల్.ఎస్.ఐ పాఠ్యాంశాల ద్వార ప్రత్యేక అవగాహన పొందుతున్నారన్నారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రసారమయ్యే VLSI పాఠ్యాంశాలు URL links వెబ్సైట్, టి-సాట్ యాప్ , యుట్యూబ్ ప్లే లిస్టులలో అందుబాటులో ఉంటాయని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. విదేశాల్లోని విద్యార్థులూ చూడవచ్చు

• VLSI పాఠ్యాంశాలకు ప్రపంచ ప్రాధాన్యత ఉన్నందున విదేశాల్లో ఉన్న భారత విద్యార్థులూ చూడవచ్చని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ రాజగోపాల్ VLSI పాఠ్యాంశాల ప్రత్యక్ష్య ప్రసారం సందర్భంగా టి-సాట్ స్టూడియోకు ఫోన్ ద్వార మాట్లాడి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ‘మా పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారు. టి-సాట్ ద్వార ప్రసారమయ్యే పాఠ్యాంశాలు అందరికీ ఉపయోగపడేవిగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పే పాఠ్యాంశాలు ఇవి. మా పిల్లలు వినడానికి వీలుంటుందా’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యాప్, యుట్యూబ్ ద్వార ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైన టి-సాట్ ప్రసారాలను వీక్షించవచ్చని సీఈవో స్పష్టం చేశారు.

(ఫొటొ రైటప్: పాఠ్యాంశాన్ని బోధిస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ ఆనంద్ బోగే, ప్రారంభ సెషన్ పాల్గొన్న వెదా డైరెక్టర్ సుబ్బ రంగయ్య, ఫొటానిక్స్ ప్రతినిథి సతీష్ రెడ్డి)