ఉస్మానియా యూనీవర్సిటి నుండి మాస్ కమ్యూనికేషన్ లో పోస్టు గ్రాడ్యుయేట్ పట్టా పొంది గత 20 సంవత్సరాలుగా జర్నలిజంలో సేవలందిస్తున్నారు శైలేష్ రెడ్డి. తొలుత న్యూస్ టైమ్, ఈటీవీ ఢిల్లీ ప్రతినిధిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కేంద్రంగా జి-24 ఛానల్ హెడ్ గా ఎలక్ట్రానిక్ మీడియాలో విభాగంలో అనేక సంస్కరణలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలోనూ జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న శైలేష్ రెడ్డిగారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వంలో ఐటి, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలోని సాఫ్ట్ నెట్ సంస్థకు సీఈవో గా నియమితులయ్యారు. సాఫ్ట్ నెట్ ద్వార నడపబడుతోన్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ, విద్య ద్వార విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మహిళ తదితర విభాగాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రాచుర్యం పొందేలా చర్యలు చేపట్టారు.
పీసరి లింగారెడ్డి
మాస్ కమ్యునికేషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గత ఇరవై సంవత్సరాలుగా జర్నలిజం, ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవం. 1999 నుండి 2003 వరకు ఈనాడు, 2003 నుండి 2009 వరకు ఈటీవీ భువనగిరి రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం.2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మైనర్ ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమ, ఐకెపి శాఖ మంత్రి కార్యాలయంలో సచివాలయం కేంద్రంగా ప్రజా సంబంధాల అధికారిగా విధులు నిర్వహణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014లో మనటీవి లో చేరి ప్రస్తుతం టి-సాట్ మేనేజర్, పబ్లిసిటి అండ్ మార్కెటింగ్ బాధ్యతల్లో...!
మెంతుల నర్సింగరావు
27 సంవత్సరాల సుధీర్ఘ ఉద్యోగ అనుభవం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు డిప్లమా ఇన్ మల్టీమీడియా పట్టా.1992 నుండి 1999 వరకు మాడ్గుగుల కిష్టారెడ్డి మెమోరియల్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా భాధ్యతలు. 2000 సంవత్సరం నుండి నేటి వరకు గ్రాఫీక్స్ అండ్ షార్ట్ ఫిలిమ్ మేకింగ్ లో సుధీర్ఘ అనుభవం.భైరవీ ఫిలిమ్స్, నిపుణ సర్వీసెస్, ప్రసాద్ ఫిలిమ్ కార్పోరేషన్, ప్రైమ్ ఫోకస్ వంటి సంస్థలలో ఆనిమేషన్ అండ్ గ్రాఫిక్స్ లో టీం వర్క్. హిందీ రుద్రాక్ష, టాంగో ఛార్లీ, తెలుగులో మగధీర, అరుంధతి, స్టాలిన్ తదితర ఛిత్రాలకు ఆనిమేషన్ మరియు గ్రాఫిక్స్ అందించి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల లో గ్రాఫిక్స్ అండ్ ఆనిమేషన్ మేనేజర్ గా భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మెంతుల నర్సింగరావు.
నంద్యాల భూపాల్ రెడ్డి
జర్నలిజంలో దాదాపు19 సంవత్సరాల అనుభవం కలిగిన నంద్యాల భూపాల్ రెడ్డి ఉస్మానియా యునివర్శిటీ నుండి బి.సి.జె పట్టా పొందారు. 2000 సంవత్సరం నుండి 2006 వరకు ఈటీవీలో ప్రోగ్రామ్ అసిస్టెంట్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ గా విధులు. జి-తెలుగు మరియు జి-ఇరవై నాలుగు ఛానల్ లో నల్గొండ స్టాఫ్ రిపోర్టర్ 2006 నుండి 2012 వరకు, 2014-2016 సాక్షి టీవీలో న్యూస్ కో-ఆర్డినేటర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్, 6టీవి ప్రిన్సిపల్ కరెస్పాండంట్ గా విధులు. టి-సాట్ లో గత మూడేళ్లుగా ప్రొడక్షన్ విభాగంలో కంటెంట్ అందిస్తూ సేవలిందిస్తున్నారు.
గంగాడి సుధీర్
జర్నలిజం వృత్తిలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల అనుభవం. ఉస్మానియా యూనీవర్శిటి నుండి ఎం.సి.జె పట్టా తీసుకున్న అనంతరం 2001లో వార్త దిన పత్రికలో ట్రైనీ సబ్-ఎడిటర్ గా కేరిర్ ప్రారంభం. నాటి నుండి నేటి వరకు విజేత కాంపిటిషన్స్ లో సబ్-ఎడిటర్. అనంతరం 2002లో ఈటీవీలో అసిస్టెంట్ ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ గానూ వివిధ హోదాల్లో 2006 వరకు పనిచేయడం జరిగింది.టీవి-9 న్యూస్ ఛానల్ లో ప్రొడ్యూసర్, 2008లో హెచ్ఎంటీవీలో సీనియర్ ప్రోడ్యూసర్, ప్రొడక్షన్ ఇంచార్జ్ గానూ పనిచేసి అనంతరం సివీఆర్ న్యూస్ ఛానల్ లో 2017.. వరకు ప్రొడక్షన్ ఇంచార్జి, చీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన అనుభవం. టి-సాట్ లో గత రెండున్నరేళ్లుగా ప్రొడక్షన్ విభాగంలో కంటెంట్ అందిస్తూ సేవలిందిస్తున్నారు.
మారునేని దయానందరావు.
జర్నలిజం వృత్తిలో పద్దెనిమిది సంవత్సరాల అనుభవం. 2001 నుండి 2009 వరకు నిజామాబాద్ లో ఆంధ్రజ్యోతి దినపత్రిక రిపోర్టర్ గా, హైదరాబాద్ లో జమీన్ రైతు, పూజ టీవీలలో పనిచేసిన అనుభవం. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి MCJ పట్టా. టి-సాట్ లో గత మూడేళ్లుగా లైబ్రరీ, ప్రొడక్షన్ విభాగంలో తన సేవలందిస్తున్నారు.
ఎం.వి.సౌజన్య.
శ్రీ వెంకటేశ్వర యూనీవర్సిటీ నుండి ఎమ్మెస్సీ (మాథ్స్)లో పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు బ్యాచిలర్ ఆఫ్ లా పట్టాను కలిగి ఉన్నారు ఎం.వి.సౌజన్య. నారాయణ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా 2009 నుండి 2013వరకు నాలుగు సంవత్సరాల పాటు మాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేసిన అనుభవం. 2015 సంవత్సరంలో మనటీవిలో డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గా చేరారు.
జూకూరి శ్రీకాంత్.
సి.ఎం.ఆర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగము లో 2014లో ఎం.టెక్ పూర్తి చేసి, అదే కళాశాలలో ఏడాదిన్నర పాటు 2016 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ బోధన భాధ్యతలు. 2017 నుండి ఏడాదిన్నర కాలంగా టి -సాట్ లో విధుల నిర్వహణ.
ఖానాపురం రాఘవేందర్.
ఖానాపురం రాఘవేందర్ లయోల కాలేజీలో ఎం.బి.ఎ పూర్తి చేసి, కె.వి.ఆర్. సర్వీసెస్ లో 2011 నుండి 2016 వరకు ఐదు సంవత్సరాల పాటు ఆపరేషన్స్ మేనేజర్ గా భాధ్యతలు నిర్వహణ. 2016లో టి-సాట్ లో చేరి మూడేళ్ల కాలంలో కార్యాలయంలో ఆయా విభాగాల్లో సేవలిందిస్తున్నారు.