పత్రిక ప్రకటన
30.07.2021
జన్మ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన టి-సాట్ సీఈవో
(టి.సాట్-సాఫ్ట్ నెట్)
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయ ఆవరణలో రెండు మామిడి మొక్కలతో పాటు, ఏడాకుల మొక్కలను సిబ్బందితో కలిసి నాటారు. ఈ సందర్భంగా శైలేష్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం కార్యాలయ ఆవరణ అంతా ఏడారిగా ఉండేదని, ప్రస్తుతం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిందన్నారు. నగరంలో పొల్యూషన్ ప్రభావాన్ని ఎదుర్కొని టి-సాట్ కార్యాలయానికి వచ్చి ఆరోగ్యవంతమైన ఆక్సిజన్ పొందడంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించవచ్చని గుర్తుచేశారు. ఈ పచ్చదనాన్ని ఇలాగే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జూలై మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖా మాత్యులు కె.టి.రామారావు టి-సాట్ కార్యాలయంలో నిండిన పచ్చదనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి స్ఫూర్తితో నా పుట్టిన రోజు సందర్భంగా మరో మూడు మొక్కలు నాటి పచ్చదనం కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేందుకు మనవంతు ప్రయత్నం చేద్దామని పిలుపు నిచ్చారు.